ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో పాఠశాల బస్సుల వాహన పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల లైసెన్సులు, డ్రైవర్ల పూర్వ చరిత్ర (Antecedents)ను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బస్సుల్లో అత్యవసర నిష్క్రమణ కిటికీలు (Emergency Windows), ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ప్రథమ చికిత్స (First Aid) సదుపాయాలు, ఎమర్జెన్సీ భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను తనిఖీ చేశారు.డ్రైవర్లు మరియు క్లీనర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, విద్యార్థుల భద్రతను అత్యంత బాధ్యతగా భావించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని సూచించారు.విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *