తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం అరవెళ్లిపాడు గ్రామంలో దొనకొండ పోలీసులు జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు మరియు ₹1,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.