తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
– 40 ఏళ్లుగా నోచుకోని సీసీ డ్రెయిన్లు, కల్వర్టు పూర్తి
– వార్డులో రెండేళ్లలో రూ.76.59 లక్షల అభివృద్ధి, సంక్షేమ పనులు.చేసిన అభివృద్ధి, పంచిన సంక్షేమం చూసి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెం 11వ వార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాను మరియు రూ.50 లక్షల NUDA నిధులతో గుడిపల్లి కాలువ సీసీ డ్రెయిన్లు, కల్వర్టు ప్రారంభించాను.