80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసు విధుల్లో ప్రతిభ కనబరిచి, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు శాఖ అధికారులు మరియు సిబ్బందిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారు ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు మరియు పోలీసు సేవా పతకాలను అందజేశారు.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని అధికారులు సూచించారు.పోలీసు శాఖలో ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు, ప్రోత్సాహం అందించడం ద్వారా సేవా స్ఫూర్తిని మరింత పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *