తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శి ఎస్సై జి. ఏడుకొండలుపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు. పోలీసులపై దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత గారు, డీజీపీ, డీఐజీ, జిల్లా ఎస్పీ గారికి లేఖ రాయడంతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది మనోధైర్యం కోల్పోవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మద్దతు పొందలేక అల్లర్లకు పాల్పడే ప్రయత్నాలను సహించేది లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూటమి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.దర్శిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసులపై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ధీమా వ్యక్తం చేశారు.