మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు శక్తి యాప్‌ను ఉపయోగించుకోవాల్సిన విధానం, యాప్ ద్వారా అందుబాటులో ఉన్న భద్రతా సేవలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాల నివారణ, అప్రమత్తత, స్వీయ రక్షణ, సైబర్ భద్రత, వేధింపుల నుంచి రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.మహిళలు, బాలికల భద్రత కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.మహిళల భద్రత, గౌరవం మరియు రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *