ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ద్వారా నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ (SSC) మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సింగరాయకొండ మండలంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల విద్యాశాఖాధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APOSS జిల్లా కోఆర్డినేటర్ శ్రీ G. రాఘవరావు, మండలంలోని అంగన్వాడీ టీచర్లు, అలాగే DRPలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, కీర్తి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు కె .మహాలక్ష్మి , అంగన్వాడీ సూపర్వైజర్ సైదాబీ, ప్రథం జిల్లా కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా APOSS ద్వారా చదువును మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయిన వారు, ఉద్యోగులు, గృహిణులు మరియు ఇతర విద్యార్థులు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా SSC, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉందని వివరించారు.అర్హులైన వారిని గుర్తించి, వారికి అవసరమైన సమాచారం అందించి, APOSSలో అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించేందుకు అంగన్వాడీ టీచర్లు మరియు DRPలకు సూచనలు అందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి, వారికి విద్యా అవకాశాలను చేరువ చేయడమే ఈ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.మండల స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు, DRPలు మరియు ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేశారు.“విద్య – వికాసం – సాధికారత” అనే లక్ష్యంతో APOSS అందిస్తున్న అవకాశాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *