తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–సమగ్ర శిక్ష, ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇయర్–3 జ్ఞాన జ్యోతి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ శిక్షణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు బాలల సమగ్ర అభివృద్ధి, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల గుర్తింపు–విలీనం, ఆరోగ్యం–పోషణ, బాలల రక్షణ, జెండర్ అంశాలు, డిజిటల్ వనరుల వినియోగం, అభివృద్ధి మైలురాళ్ల అంచనా తదితర అంశాలపై శిక్షణ అందించారు.
కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి సందర్శించి శిక్షణ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రధానోపాధ్యాయురాలు కె. మహాలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారులు కత్తి శ్రీనివాసరావు, ఆవుల శ్రీనివాసులు శిక్షణను సందర్శించి, ఆరు రోజుల శిక్షణలో నేర్చుకున్న మెలకువలను అంగన్‌వాడీ కేంద్రాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని బాలల సమగ్ర అభివృద్ధి, సమానత్వం, సమాజంలో ప్రతి చిన్నారికి సముచిత అవకాశాలు కల్పించడమే జ్ఞాన జ్యోతి శిక్షణ ప్రధాన లక్ష్యం అని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, కీర్తి శ్రీనివాసరావు తదితరులు శిక్షణ నిర్వహణలో, సైదాబీ, కుసుమ సూపర్వైజర్లుగా సహకరించారు.