అప్రైజర్ వ్యవస్థను ఏజెన్సీల విధానంలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని తక్షణం మానుకోవాలని ఏ బి జి ఏ యూ విజ్ఞప్తి చేసింది. ఏ బి జి ఏ యూ రాష్ట్ర సమితి పిలుపుమేరకు బుధవారం కందుకూరులో గోల్డ్ అప్రైజర్ల సంఘం,కందుకూరు స్వర్ణకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ కృష్ణయ్య, కొమ్మెర్ల విజయ్ లకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా కెనరాబ్యాంక్ అప్రైజర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు లంకెనపల్లి బ్రహ్మచారి మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు బ్యాంకులలో గోల్డ్ అప్రైజర్ గా బ్యాంకు నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్నాము. అప్రైజర్ విధానం మీదనే ఆధారపడి మా కుటుంబాలను పోషించుకుంటున్నాము. బంగారం నాణ్యత స్వచ్ఛత బరువు వంటి అంశాలను మా వృత్తి నైపుణ్యం ద్వారా పరిశీలించి బ్యాంకులకు ఎటువంటి నష్టం జరగకుండా ఎంతో జాగ్రత్తతో పరిశీలించి మా వృత్తిని మేము కొనసాగిస్తున్నాము. కొంతమంది బ్యాంకుల నుండి పదవి విరమణ పొందిన వ్యక్తులు, మరికొన్ని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అప్రైజర్ల విధానం కొనసాగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి విధానం అమలులోకి వస్తే అప్రైజర్లు మధ్యవర్తుల మీద ఆధారపడి వృత్తిని కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కష్టపడుతున్న తమకు రావలసిన ప్రతి ఫలం మధ్యవర్తుల ద్వారా తమకు అందవలసి వస్తున్నదని ఈ విధానం కొనసాగితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ఎంతో గౌరవంగా స్వర్ణకార వృత్తి కొనసాగించిన స్వర్ణకారులు అప్రైజర్ వ్యవస్థ ప్రైవేటు ఏజెన్సీలకు వెళితే అప్రైజర్లు ఎంతో నష్టపోవలసి వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు ఒకటి రెండు రోజులు ట్రైనింగ్ పొందితే బ్యాంకులలో అటువంటి వ్యక్తుల వల్ల ఎంతో నష్టం జరిగే పరిస్థితి ఉందని వారు తెలిపారు. బంగారం విలువను అంచనా వేయడం ఒకటి రెండు రోజుల శిక్షణతో సాధ్యపడదని సంవత్సరాల తరబడి సాధన చేస్తేనే అది వీలవుతుందని వారు తెలిపారు. గోల్డ్ అప్రైజర్ వ్యవస్థను బలహీనపరిచే విధానాన్ని స్వర్ణకార సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ అప్రైజర్లు ఏ శ్రీనివాసులు, ఎల్ బాల బ్రహ్మచారి,చంద్రశేఖర్, పాపయ్య యూనియన్ బ్యాంక్ అప్రైజర్లు బాలకోటయ్య సిహెచ్ సుబ్బారావు, కరూర్ వైశ్యా బ్యాంక్ అప్రైజర్ ఎం శ్రీనివాసులు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అప్రైజర్లు సుబ్రహ్మణ్యం, హరిబాబు ఐసిఐసిఐ బ్యాంక్ అప్రైజర్లు నాగభూషణాచారి సుబ్బనాచారి, సెంట్రల్ బ్యాంక్ అప్రైజర్ బి రమేష్ బాబు, ఇండియన్ బ్యాంక్ అప్రైజర్ ఎం వెంకటేశ్వర్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రైజర్ వీరనారాయణ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రైజర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *