కోవూరు గాంధీ పార్కులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారితో కలిసి ఆవిష్కరించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను.తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.ఆయన చరిత్ర, ఆశయాలు రాబోయే తరాలకు తెలియాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గాదిరాజు అశోక్ గారికి ప్రత్యేక అభినందనలు.మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా మన చరిత్రను భావితరాలకు అందిద్దాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *