తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
గణేష్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒంగోలు డీఎస్పీ గారు కొత్తపట్నం, ఈతముక్కల మరియు మాడనూరు బీచ్లను సందర్శించి పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో బీచ్లకు వచ్చే అవకాశం ఉన్నందున బ్యారికేడింగ్ (B/B), ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, గజ ఈతగాళ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు మరియు ఇతర భద్రతా చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులకు డీఎస్పీ గారు పలు సూచనలు చేశారు.నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని, నిమజ్జనానికి వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.అలాగే, నీటి ప్రవాహం మరియు సముద్ర పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు సముద్రంలోకి వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని తెలిపారు.