మార్కాపురం జిల్లా కంభం మండలంలోని: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఎంఈవో అబ్దుల్ సత్తార్ పాఠశాలను సందర్శించి, తరగతుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను పరిశీలించారు.జాబితాలో విద్యార్థుల అడ్మిషన్ నంబర్, PEN నంబర్, తల్లిదండ్రుల పేర్లు తదితర వివరాలను పొందుపరిచినట్లు ఎంఈవో తెలిపారు. SMC ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ జాబితాను పాఠశాలలో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న SMC ఎన్నికల్లో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *