కందుకూరులోని గుర్రంవారిపాలెంలో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్‌లో జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 29న నిర్వహించనున్న కార్యక్రమానికి ముందస్తు అవగాహనలో భాగంగా శుక్రవారం ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం ఈ వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ N. శివకృష్ణ (కార్డియాలజీ స్పెషలిస్ట్, సంఘమిత్ర హాస్పిటల్ ), డాక్టర్ G. వెంకటేష్ (డయాబెటిక్ స్పెషలిస్ట్, శారద నర్సింగ్ హోమ్ హాస్పిటల్) మరియు డాక్టర్ M. బ్రాహ్మిణి (IVF స్పెషలిస్ట్, శారద నర్సింగ్ హోమ్ హాస్పిటల్) పాల్గొని తమ వైద్య సేవలను అందించారు. వీరి ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, పాఠశాలలో సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్పర్స్‌కు బీపీ , షుగర్ తదితర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటికి దారితీసే కారణాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలను ముందుగానే ఎలా గుర్తించాలి, వాటిని నివారించేందుకు ఎలాంటి ఆహారం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలి అనే అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ , ప్రతాప్ (మేనేజర్) తమ సహకారాన్ని అందించారు. అలాగే శారద నర్సింగ్ హోమ్ సిబ్బంది మాధురి, అశ్విని, ప్రవీణ్ వైద్య బృందానికి సహకరిస్తూ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పాఠశాలలో సేవలందించే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ ముందస్తు వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే, వాటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతు “ఆరోగ్యం పట్ల అవగాహన – వ్యాధులపై ముందస్తు జాగ్రత్త – ఆరోగ్యమే భవిష్యత్తుకు బలమైన పునాది” అనే సందేశంతో శ్రీ సంస్కృతి స్కూల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రస్తుత సమాజంలో ప్రజలకి రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గింది, దానిని ఎలా మెరుగు పరచుకోవాలో, డాక్టర్లు చాలా చక్కగా వివరించారని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారికి, డాక్టర్స్ కి , వైస్ ప్రిన్సిపల్ శోభారాణి గారికి, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ,ప్రిన్సిపల్ హరి కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *