తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:-
యర్రగొండపాలెంకు చెందిన దూదేకుల సయ్యద్ మహమ్మద్ (24 సంవత్సరాలు) అనే వ్యక్తి 17.09.2026 తేదీన రాత్రి 10:11 గంటల సమయంలో ట్రాక్టర్ కొనివ్వలేదని కుటుంబ సభ్యులపై అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం త్రిపురాంతకం సమీపంలోని NSP కాలువ వద్దకు చేరుకుని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కాలువలోకి దూకి చనిపోతానని చెప్పి ఫోన్‌ను కట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 112 కు కాల్ చేయగా, వెంటనే అప్రమత్తమమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది తగిన సమాచారమును సంబంధింత అధికారులకు తెలియపరిచారు. వెంటనే సంబంధించిన త్రిపురాంతకం ఎస్సై శివరామయ్య ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సయ్యద్ మహమ్మద్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. తన ASI సంజయ్ మరియు సిబ్బంది త్రిపురాంతకం వద్ద ఉన్న NSP కెనాల్ దగ్గర చేరుకొని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి,మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన త్రిపురాంతకం ఎస్సై శివరామయ్య, ASI సంజయ్, సిబ్బంది మరియు ఐటి కోర్ సిబ్బందిని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు అభినందించారు.