కందుకూరు మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించి 5,098 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాగా, అనంతసాగరం గ్రామానికి తొలివిడతగా కేటాయించిన 491 పాసుపుస్తకాలను రైతులకు అందజేశాను. అనంతసాగరంలో 56 ఎకరాల భూమిని గ్రామకంఠం కింద తప్పుగా నమోదు చేసిన అంశంతో పాటు, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తోంది.అలాగే కందుకూరు మండలంలోని గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రూ.30 కోట్లు మంజూరు చేయించాం. టెండర్లు పూర్తయ్యాయి, పనులు కొనసాగుతున్నాయి. రాబోయే 5–6 నెలల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా రామతీర్థం నీటిని అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.కొల్లగుంట గ్రామంలో 4/1, 95 సర్వే నంబర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఇతర భూసమస్యలను గ్రామస్తులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను.గత రెండున్నరేళ్లలో గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాం. అలాగే గ్రామం నుంచి కనిగిరి రోడ్డు వరకు రూ.70 లక్షలతో తారురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *