కందుకూరు నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇద్దరు టీచర్లు, 21 మంది ఆయా పోస్టులకు కొత్తవారిని నియమించగా…. గౌరవ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వారందరినీ అభినందిస్తూ, శనివారం కందుకూరులోని తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. రాబోయే తరం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా… గర్భిణీలకు, బాలింతలకు మరియు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు వారికి సూచించారు. అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అక్కడికి వచ్చే పిల్లలను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమానికి సిడిపివోలు ఉషారాణి, మాధవిలత, పలువురు నాయకులు హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *