తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు IAS విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు విద్యాశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి, విద్యార్థుల అభ్యసన స్థాయి, పాఠశాలలు–హాస్టళ్లలో సదుపాయాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ
‘వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్’ ద్వారా అధికారులు విద్యార్థులతో మమేకమై, వారి ప్రగతిని పర్యవేక్షిస్తూ అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందించనున్నారు. విద్యార్థులే విద్యార్థులకు తోడుగా…‘యువసాథీ’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల మధ్య పరస్పర అభ్యసనం, ఆలోచనల పంచుకో