తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయత్రీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఐదు రోజుల పాటు శ్రీ గాయత్రీ భవన్–1 ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేక పూజలు, భజనలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రీ గాయత్రీ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది భారీ రోడ్ షో నిర్వహించారు. శ్రీ గాయత్రీ విద్యా సంస్థలకు చెందిన అన్ని క్యాంపస్‌ల మీదుగా ఉత్సాహభరితంగా సాగిన ఈ రోడ్ షోలో విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పాకల వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం నిర్వహించారు.ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం విద్యార్థులు, సిబ్బందిలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. అలాగే వినాయకునికి సమర్పించిన ప్రత్యేక 21 కిలోల లడ్డూ వేలం కార్యక్రమం నిర్వహించారు. ఈ లడ్డూను రూ.56,001/-లకు రెవంత్ సర్ మరియు అసిఫ్ సర్ సంయుక్తంగా వేలంలో దక్కించుకున్నారు.విద్యార్థుల్లో భక్తి, ఐక్యత, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకునేలా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు శ్రీ గాయత్రీ విద్యా సంస్థల యాజమాన్యం తెలిపింది.వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తి, ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.