కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించాను.గత 15 ఏళ్లుగా జరగని మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో, ప్రజల ఆశీర్వాదంతో చైర్మన్‌తో పాటు 40 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చాను.కందుకూరు పట్టణ అభివృద్ధికి రహదారులు, డ్రైనేజీలు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకురావాలన్న హామీని కూడా నెరవేర్చాం.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించడంతో పాటు, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఐకమత్యంతో పనిచేయాలి. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *