ఒంగోలు ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 19వ వర్ధంతి సందర్బంగా మంత్రివర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారు, మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి గారు మరియు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గార్లతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద నున్న ఆంజనేయులు గారి విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయం లోని వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి,తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు మా పెద్దాయన గారు, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించేవారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసారు అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దాయనకు నివాళులు అర్పించడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *