మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సీఐ గారు సర్కిల్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలతో క్రైమ్ మీటింగ్ నిర్వహించి పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితి, UI కేసుల పెండెన్సీ, ఎన్ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు మరియు స్మార్ట్ పోలీసింగ్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేర నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా, సమర్థవంతమైన ఎన్ఫోర్స్‌మెంట్‌తో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.అదేవిధంగా గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ గారు సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలతో క్రైమ్ మీటింగ్ నిర్వహించి, CD ఫైల్స్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, కేసుల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక వ్యక్తులు మరియు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైన బైండోవర్ చర్యలు చట్టప్రకారం చేపట్టాలని అధికారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *