స్థానిక బాలికోన్నత పాఠశాలలో బుధవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. భోజన తయారీ విధానం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ, ఆహార నాణ్యత, పరిమాణాలను ఆయన పరిశీలించారు. వంట ప్రారంభించే ముందు బియ్యం, కూరగాయలు తదితర పదార్థాల నాణ్యతతో పాటు వంటశాల పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. బియ్యం అధికంగా ఉన్నప్పుడు రెండు పాత్రల్లో వంట చేయాలని చెప్పారు. విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేసే ముందు వాటి గడువు తేదీని పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈవో చెప్పారు.అనంతరం పాఠశాల విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.అమూల్య , ఉపాధ్యాయులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *