దొనకొండ మండలం చందవరం గ్రామంలోని చారిత్రక బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు, టూరిజం, కల్చరల్, పురావస్తు శాఖల అధికారులతో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రాంతాన్ని సందర్శించారు.ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బౌద్ధ క్షేత్రాల్లో చందవరం బౌద్ధ స్థూపానికి ప్రత్యేక గుర్తింపు ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు. గుండ్లకమ్మ నది సమీపంలో,బెంగళూరు–చెన్నై–హైదరాబాద్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మరింత ప్రాధాన్యత పెరుగుతుందని పేర్కొన్నారు.చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ బౌద్ధ స్థూప ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.చందవరం బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఆర్కియాలజీ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *