కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో దసరా పండుగ సందర్భంగా ముందస్తు వేడుకలను, అక్టోబర్ 10 వ తేది శనివారం పాఠశాల ప్రాంగణంలో, అత్యంత వైభవంగా మరియు కోలాహాలంగా నిర్వహించారు. రాబోయే దసరా పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకొని పాఠశాల యాజమాన్యం విద్యార్థులలో పండగ వాతావరణాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఈ సంబరాలను ఏర్పాటు చేశారు.
వేడుకలలో ముఖ్య విశేషాలు ఏమిటంటే బతుకమ్మ సంబరాలను విద్యార్థినిలు ఉపాధ్యాయులతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి సాంప్రదాయ పాటలతో చప్పట్లు చరుస్తూ ఆనందంగా బతుకమ్మ ఆడారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, దేవి వేషధారణలు,దసరా ప్రాముఖ్యతను తెలిపే ప్రదర్శనలు, నాటికలు వీక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండగని, విద్యార్థులు కూడా తమలోని చెడు అలవాట్లను వీడి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం శ్రీ సంస్కృతి స్కూల్లో దసరా ముందస్తు వేడుకలను నిర్వహిస్తామని, ఈ వేడుకల ద్వారా పిల్లలకు మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతిని , తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారికి, వైస్ ప్రిన్సిపల్ శోభారాణి గారికి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ హరి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *