తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చీమకుర్తి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు చీమకుర్తి పట్టణ శివార్లలో నిర్వహిస్తున్న జూదంపై దాడి చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి జూదానికి వినియోగిస్తున్న రూ.6,180/- నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.జూదానికి దూరంగా ఉండండి – చట్టాన్ని గౌరవించండి. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.