టంగుటూరు వాణి నగర్లో వేంచేసియున్న గణపతి స్వామివారికి బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక ఏకదంతా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు ముఖ్య అతిధిగా విచ్చేసి గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఏకదంతా సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన పోతుల నరసింహారావు, గుడిపూడి నరసింహం, రావూరి సతీష్, చిడిపోతు సుబ్బారావు, కసుకుర్తి శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ఏకదంతా సేవా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *