తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ పంకజ్ కుమార్ మీనా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నేరాల నియంత్రణ, మహిళా భద్రత, గంజాయి, అక్రమ మద్యం అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా తనను కలవవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.