తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ప్రాజెక్టులోనే కందుకూరు టు సెక్టార్ నందు కొండి కందుకూరు టు అంగన్వాడీ కేంద్రంలో గురువారం సిడిపిఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహార మాసొత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ ఎల్ లక్ష్మీదేవి ఆహార వైవిధ్యం,తాజా వేడి భోజనం,సమాజ భాగస్వామ్యం, జవాబుదారీతనం, పోషణ మరియుబాల్య వికాసం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇంకా,బాలికల సంరక్షణ, విద్య తో పాటు సమాజ భాగస్వామ్యం ఆరోగ్య కరమైన భావష్యత్ కు బాటలు వేయాలని, అంగన్వాడీ కేంద్రాలా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నాకు అంగన్వాడీ కార్యకర్తలు యన్ సుభాషిణి, జి సుభాషిణి, ఆయా కుమారి, తల్లులు పాల్గొన్నారు…