జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాకలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆధ్వర్యంలోని పాఠశాల బీఐఎస్ క్లబ్ నిర్వహించిన ట్రెజర్ హంట్ యాక్టివిటీ పోటీలో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. ప్రసాదు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. విద్యార్థులు పాఠశాల బీఐఎస్ క్లబ్ ద్వారా బీఐఎస్ ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన పెంపొందించుకుని, సమాజంలో కూడా నాణ్యమైన వస్తువుల వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.పాఠశాల బీఐఎస్ క్లబ్ మెంటార్, బయాలజీ ఉపాధ్యాయులు డి. విజయానంద్ మాట్లాడుతూ, భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను కాపాడటంలో బీఐఎస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వివిధ ఉత్పత్తులకు ప్రమాణాలను నిర్ణయించడం, ఐఎస్ఐ సర్టిఫికేషన్, నాణ్యతా ప్రమాణాల తనిఖీ వంటి కార్యక్రమాల ద్వారా బీఐఎస్ వినియోగదారులకు సేవలందిస్తోందని తెలిపారు. పాఠశాలల్లో బీఐఎస్ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఐఎస్ఐ సర్టిఫికేషన్, నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ, నాణ్యమైన వస్తువుల వినియోగం పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తోందని వివరించారు.అనంతరం ట్రెజర్ హంట్ యాక్టివిటీ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.1,500ను సంపత్, ద్వితీయ బహుమతి రూ.1,000ను ఈతముక్కల పృథ్వి, తృతీయ బహుమతి రూ.750ను లాస్య, కన్సొలేషన్ బహుమతి రూ.250ను సందీప్ జాషువా అందుకున్నారు. ప్రధానోపాధ్యాయులు ఎస్. ప్రసాదు విజేతలకు నగదు బహుమతులతో పాటు బీఐఎస్ మెడల్స్, గిఫ్టులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్వీఎన్ఎస్ ప్రసాదు, నూకసాని వెంకటేశ్వర్లు, సిహెచ్. మనోహర్, జి. భాస్కరరావు, పి.తిరుమలరావు, ఎం. చంద్రశేఖర్, పీఈడీలు వడ్లమూడి కోటేశ్వరరావు, తేళ్ల వంశీకృష్ణ, షేక్ రసూల్, వి. శంకర్రావు, శ్రీదేవి, కల్పన తదితరులు, బీఐఎస్ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *