కోవూరు మండల పరిషత్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాను.గత ఐదేళ్లుగా పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, కోవూరు అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజలతో ఉన్న అనుబంధం ముగిసిపోదు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ నాయకులే.కోవూరులో రోడ్లు, సీసీ డ్రెయిన్ల వంటి సమస్యల పరిష్కారానికి ఎంపీ ల్యాడ్స్‌, నుడా, సీఎస్‌ఆర్‌, ఇతర నిధులను సమన్వయం చేసి త్వరలో దాదాపు రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నాం.స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని భవిష్యత్తులోనూ కోవూరు అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతున్నాను. ప్రజాసేవ పట్ల ఆసక్తి, అంకితభావం ఉన్న ప్రతి ఒక్కరూ మళ్లీ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *