తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన దొండపాటి బ్రహ్మయ్య (37 సం)అనే వ్యక్తి తేదీ:09.08.2025 న 8 సంవత్సరాల మైనర్ బాలిక యెడల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై ఫిర్యాదు అందటంతో అప్పటి దొనకొండ పోలీస్ స్టేషన్ SI త్యాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్టు చేసి, కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేసినారు.పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిండుతునిపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 24.09.2026న గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు ముద్దాయి కి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష రూ. 3000 వేల రూపాయలు జరిమానా, భాధితురాలకు నష్టపరిహారంగా 10,000/- రూపాయలు చెల్లించ వలసినదిగా జడ్జీ గారు ఆదేశించి నారు.పై కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అప్పటి దొనకొండ పోలీస్ స్టేషన్ SI త్యాగరాజు, POCSO Court Spl PP గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజెన్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు అభినందించారు.