కాలనీ అభివృద్ధికి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కందుకూరు పట్టణంలోని విక్కిరాలపేట రోడ్డులో 6వ వార్డు సుందరయ్య నగర్…. పేద ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. మెకానిక్ లు, కూలీలు, ఇంకా అనేక చిన్న వృత్తుల వారు నివసిస్తుంటారు. రోజూ పనికి వెళితేనే కుటుంబం గడిచే పరిస్థితి.గతంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా, సరైన పొజిషన్ చూపించలేదు. చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు. రోడ్లు, డ్రైనేజీ కాలువలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు… శుక్రవారం ఉదయం అధికారులు, నేతలతో కలిసి అక్కడ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సుందరయ్య నగర్ ప్రాంతాన్ని పూర్తిగా సర్వే చేసి, గతంలో ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపించాలని తహసిల్దార్ మురళిని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. స్థలాలు లేని వారి లిస్ట్ తయారు చేస్తే, వారందరికీ స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇక సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలకు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి, వీలైనంత త్వరగా నిర్మాణాలు చేయించాలని కమిషనర్ అనూషకు నాగేశ్వరరావు గారు సూచించారు. వర్షం కురిసినప్పుడు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేకంగా కాలువ నిర్మించాలని ఆదేశించారు.ఇప్పటికే 40 కోట్లతో అమృత్ పథకం ద్వారా పట్టణం చుట్టూ శివారు ప్రాంతాలకి తాగునీరు అందించే పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. అందులో భాగంగా జీ ప్లస్ త్రీ ఇళ్ల దగ్గర నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా సుందరయ్య నగర్ ప్రాంతంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రామతీర్థం నీటిని అందిస్తామని తెలియజేశారు. ఈ సమస్యలన్నీ 3 నెలల్లో పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, స్థానికులు చెప్పిన సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని చెప్పారు. అనంతరం 7వ వార్డు మహబూబీ నగర్ లో కూడా ఎమ్మెల్యే పర్యటించారు. అక్కడ కూడా రోడ్ల సమస్యపై స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నాయబ్ రసూల్, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ బాషా, పార్టీ నేతలు జియావుద్దీన్, ఫిరోజ్, మూసా, ఖాదర్, సుభాని, శ్రీను, సలీం, హష్మతుల్లా, మాల్యాద్రి, రవిచంద్ర, సిపిఎం నాయకులు గౌస్ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *