కార్మికుడు ఓబయ్యపై దాడి ఆరోపణలు.. సానిటేషన్ ఇన్‌స్పెక్టర్, నాయబ్ రసూల్‌ను సస్పెండ్ చేయాలని నినాదాలు
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కనిగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఓబయ్యపై సానిటేషన్ ఇన్‌స్పెక్టర్, నాయబ్ రసూల్ దాడి చేశారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఘటనను నిరసిస్తూ కనిగిరి పురపాలక సంఘం కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సానిటేషన్ ఇన్‌స్పెక్టర్, నాయబ్ రసూల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. కార్మికుడు ఓబయ్యకు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.