కనిగిరిలో జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్దన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ ముత్తుమూల అశోక్ గార్లతో కలిసి పాల్గొని మహిళకు కుట్టు మిషన్లు అందజేసిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ *శ్రీ దామచర్ల సత్య.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ, వారు స్వశక్తితో ఎదిగి కుటుంబాలకు అండగా నిలిచేలా అనేక అవకాశాలను కల్పిచడం జరుగుతుంది. శిక్షణ పొందిన మహిళలు తమ నైపుణ్యాన్ని ఉపాధిగా మలుచుకుని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం అభినందనీయం. మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయన్న ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జనని చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *