ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రాత్రివేళల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన నైట్ బీట్ నిర్వహిస్తున్నారు.నైట్ బీట్‌లో భాగంగా పోలీసులు ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, నిర్మానుష్య ప్రదేశాలు మరియు నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల వాహన తనిఖీలు చేపడుతున్నారు.రాత్రివేళల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *