తంబళ్లపల్లెలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఆర్ & బి మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శంకర్ యాదవ్ గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య.ఈ సందర్భంగా అక్టోబర్ 2 న సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి మదనపల్లె పర్యటన పై సమీక్షించి, పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించడం జరిగింది.అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించి, కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్, జనసేన ఇంచార్జి సాయి , తదితరులు పాల్గొనడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *