లింగసముద్రం మండలం మాలకొండరాయునిపాలెం పంచాయతీ పరిధిలోని ముక్తేశ్వరం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశాను.గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, స్మశానవాటికకు కొత్తగా నిర్మించిన గ్రావెల్ రోడ్డును పరిశీలించాను. స్మశానవాటికకు ఫెన్సింగ్, లోపల బోరు ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవోను ఆదేశించాను.త్వరలో ముక్తేశ్వరం నుంచి వలేటివారిపాలెం వరకు రూ.20 లక్షలతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయనున్నాం. గ్రామంలోని తాగునీరు, వీధిలైట్ల సమస్యలను వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.అలాగే విశ్వనాధపురం–గంగపాలెం మధ్య కొత్త తారురోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులను వేగంగా చేపడుతున్నాం.గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురండి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను.ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి మరింత బలాన్ని అందించాలని కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *