తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ఈ నెల 9వ తేదీన మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి పర్యటనను సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు, SSG అధికారులు, మరియు ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.అనంతరం ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం, హెలిప్యాడ్ ప్రాంతం నుండి ప్రజావేదిక, గ్రామ సభ, అనంతరం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశానికి సంబంధించిన సభా స్థలాలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ సభా వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ వద్ద భారీ గేట్లు, ట్రాఫిక్,ప్రజా వేదిక ప్రదేశంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు గా కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చూడాలన్నారు.ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం గారి పర్యటన నిమిత్తం పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, SSG అడిషనల్ ఎస్పీ శాంతి కుమార్,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యన్.యుగంధర్ బాబు,ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు, సీఐ లు,ఎస్సైలుపాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *