సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీలు పెంపు పట్ల మంత్రి హర్షం
సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి డా.స్వామి
తొలి శుభోదయం న్యూస్ అమరావతి :-
పేద విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మెస్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం పట్ల మంత్రి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…సంక్షేమ హాస్టళ్లు, గరుకులాల్లో డైట్ చార్జీలు పెంచడం శుభపరిణామని అన్నారు. మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి స్వామి పేర్కొన్నారు. కూటమి పాలనలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను తీర్చి దిద్దుతున్నామన్నారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.