డిమాండ్ల వినతి పత్రాన్ని తీసుకున్న మంత్రి, ఒంగోలు ఎంపీ, ఒంగోలు, కందుకూరు, ఎమ్మెల్యేలు.
వేజ్ బోర్డు సిఫాస్తులు అమలు కు, రైల్వే పాస్ పునరుద్ధరణకు కృషి మంత్రి డోలా.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ IJU పిలుపులో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జర్నలిస్టుల డిమాండ్స్ వినతి పత్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరీ నాగేశ్వరరావు కు అందజేయడం జరిగింది. ముందుగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి డోలా జర్నలిస్టులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి తాను సిఫారసు చేస్తానని, రాష్ట్ర పరిధిలో ఉన్న వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకుఈ ప్రభుత్వ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వినతి పత్రంలో పేర్కొన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఆలుగుల సురేష్, జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొలకలూరి విజయ్, కెమెరామెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాషా, సామ్నా జిల్లా నాయకులు బంగి లింగరాజు, రంగన్న, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోటిరెడ్డి, సుబ్బారావు, ప్రతాప్, శ్రీనివాసరావు, రాజు ,ప్రైమ్ 9 శీను, తదితరులు పాల్గొన్నారు.