నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను డైరెక్టర్లు వి. మర్రెడ్డి, వి. శాలిని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమంలో విద్యార్థులు గాంధీజీ జీవిత విశేషాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, సత్యం, అహింస, శాంతి వంటి ఆయన బోధించిన విలువలను వివరిస్తూ ప్రసంగాలు, దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వి. శాలిని రెడ్డి మాట్లాడుతూ, “మహాత్మా గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సందేశం. సత్యం, అహింస, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలను ఆయన తన జీవితంలో ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. నేటి విద్యార్థులు గాంధీజీని కేవలం చరిత్రలో ఒక మహానాయకుడిగా కాకుండా, ఆయన చూపిన విలువలను తమ జీవితంలో ఆచరించాల్సిన మార్గదర్శిగా భావించాలి. పరిశుభ్రత పట్ల బాధ్యతను అలవర్చుకోవడం కూడా గాంధీజీకి మనం అందించే నిజమైన నివాళిలో ఒక భాగం” అని అన్నారు.గాంధీజీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ పాఠశాల పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డీ. శివకుమార్, యాజమాన్య ప్రతినిధి కె. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు.అనంతరం విద్యార్థులకు పరిశుభ్రత, వ్యక్తిగత బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమిష్టి భాగస్వామ్యంతో గాంధీ జయంతి వేడుకలు మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *