తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. పల్లె పండుగ–3 కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, తారురోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు జనార్దన్ గారు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా యరజర్ల గ్రామంలో రూ.1.00 కోట్లతో అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు శంకుస్థాపన చేశారు. యరజర్ల గ్రామంలో 600 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సర్వేరెడ్డిపాలెం గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసరావు, క్లస్టర్ కన్వీనర్ నల్లమోతు గంగాధర్, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, MRO కృష్ణ మోహన్, MDO రాజశేఖర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.