తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-

ఈ సందర్భంగా సూపర్వైజర్ నాగలక్ష్మి మాట్లాడుతు.
నేడు దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 157 జయంతిని ఘనంగా నిర్వహిస్తారని. ప్రతి ఏడాది అక్టోబర్ 2న గాంధీజీ జన్మదినాన్ని గాంధీ జయంతిగా జరుపుకుంటామని.
సత్యం, అహింస, శాంతి, సమానత్వం అనే సిద్ధాంతాలతో మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారనీ ప్రజలను ఏకం చేసి, అహింసా మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపించారనీ.
గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గాంధీజీ జయంతిని జరుపుకుంటారని అక్కడికి వచ్చిన తల్లులకు పిల్లలకు వివరించడం జరిగింది. ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు వెళ్లాలని .గాంధీజీ జీవితం కేవలం స్వాతంత్ర్య పోరాటానికే పరిమితం కాలేదనీ. స్వచ్ఛత, గ్రామీణ అభివృద్ధి, సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం వంటి అంశాలకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారనీ.
గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన, ప్రసంగ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ
“నా జీవితం నా సందేశం” అనే గాంధీజీ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకుని, సత్యం మరియు అహింస మార్గంలో నడవాలని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ప్రస్తుత సమాజంలో కూడా గాంధీజీ ఆలోచనలు శాంతి, సామరస్యం, సహనం, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నాయి.ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగలక్ష్మి అంగన్వాడీ టీచర్లు శారద. ఇస్తే రమ్మ. మరియమ్మ. ఆయాలు. తల్లులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *