కందుకూరు పెద్ద బజారునందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విగ్రహ నిర్మాణ కర్త పబ్బిశెట్టి వరదరాజ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడం అందరికీ ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గం సత్యమే పలుకుట, అహింస, సేవ, అలుపెరుగని పోరాటం ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పబ్బిశెట్టి వరదరాజ, కొత్తూరు వెంకట సుధాకర్,చక్కా వెంకటకేశవరావు, తాతా లక్ష్మీనారాయణ, చీదెళ్ల శ్రీనివాసులు, రవ్వ శ్రీనివాసులు, నల్లమల్లి రామారావు, అనుమాల శెట్టి శ్రీకాంత్, చీదెళ్ల రాజా, బోణాల నాగేశ్వరరావు, మురారి శెట్టి సత్యనారాయణ (స్వామి), నీలి శెట్టి నాగేశ్వరరావు, దోగిపత్తి క్రాంతి, ఇమ్మడిశెట్టి సురేష్, తటవర్తి సత్యం, పాదర్తి సురేష్, బచ్చు అనిల్, కొత్తూరి బ్రహ్మం, మురారి శెట్టి వెంకటేశ్వర్లు (MM) మహేష్, తటవర్తి కొండలు తదితరు పాల్గొన్నారు.
గాంధీ గారి సూక్తులు…
మానవసేవే మాధవసేవ….
ధర్మో రక్షిత రక్షితః….
సత్యమేవ జయతే….
సత్యం. అహింసలే గాంధీ మార్గం….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *