రొయ్యల పరిశ్రమ కార్మికులకు హక్కులు, ఆరోగ్యం, సామాజిక భద్రతపై అవగాహన
పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు 0 పిర్యాదుల కమిటీ కీలకం
కార్మికులు తమ హక్కులను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
యూరోపియన్ యూనియన్ ఆర్ధిక సహకారంతో సార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రొయ్యల సరఫరా గొలుసులో పనిచేస్తున్న కార్మికులకు ఎంపవరింగ్ ఆన్ రైట్స్ , సేఫ్టీ & సోషల్ ప్రొటెక్షన్ అంశంపై ఈరోజు పాకల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో మహిళా కార్మికుల ఆరోగ్యం, భద్రత, రక్షణతో పాటు కార్మికుల హక్కులు, చట్టపరమైన రక్షణలు గురించి వివరించారు. కార్మికులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధమైన మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.రెడ్ క్రాస్ ప్రతినిధి శ్రీనివాస్ ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిపిర్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కౌన్సెలర్ బాషా వివిధ సామాజిక భద్రతా పథకాలు, వాటి ప్రయోజనాలు మరియు అర్హతల గురించి వివరించారు. అర్హులైన కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జెండర్ ఎక్స్పర్ట్ సంధ్య పని ప్రదేశాల్లో మహిళల భద్రత, లైంగిక వేధింపుల నిరోధక చర్యలు, ఫ్యాక్టరీల్లో ఏర్పాటు చేయాల్సిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ, ఫిర్యాదు చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.గాంధీ జయంతి సందర్బంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర చిత్రపటానికి పూల మాల వేయగా కార్యక్రమానికి సార్డ్స్ సిబ్బంది కోటయ్య అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో సార్డ్స్ సిబ్బంది, కార్మికులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.
