తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
చింతలపాలెం గ్రామానికి చెందిన కుందూరు సాయి కృష్ణ NEETలో All India Rank 37,932, State Rank 1,016 సాధించి, ప్రతిష్టాత్మక Bangalore Medical College & Research Instituteలో ఉచిత MBBS సీటు సాధించడం ఎంతో గర్వకారణం.ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని కలిసి తన విజయాన్ని తెలియజేయగా, ఆమె సాయి కృష్ణను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.సాయి కృష్ణ విజయం దర్శి ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలి. భవిష్యత్తులో వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు!