తొలి శుభోదయం న్యూస్ రామాయపట్నం:-
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికి ఆర్. ఆర్. ప్యాకేజీ ఇవ్వాలి.
రామాయపట్నం పంచాయతీ లోని పల్లెపాలెంను నిర్వాసితుల జాబితాలో చేర్చి 400 కుటుంబాలకు ఆర్. ఆర్. ప్యాకేజీ ఇవ్వాలి.అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు కందుకూరులోని త్యాగరాజస్వామి గుడి మందిరంలో జరిగే జిల్లాసదస్సును జయప్రదంచేయాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం. రమేష్ ప్రెస్ మీట్ లో కోరారు.ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్. నరసింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. అజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.
రామాయపట్నం పోర్ట్ మొదటిదశలో 4929 కోట్ల రూపాయల వ్యయంతో 4 బెర్తులు, 34 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన పనులునేటికి 80 శాతం పూర్తయ్యాయి అన్నారు .ఈ ప్రాజెక్టును క్రమంగా 19 బెర్తులు 138 మిలియన్ టన్నుల ఎగుమతి, దిగుమతుల సామర్ధ్యానికి పెంచనున్నారు.మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేసి వాణిజ్యకార్యకలాపాలను ప్రారంభించే సమయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలపాటు పోర్టును ప్రవేట్ సంస్థలకు అప్పగించడం కోసం 2026 జూలై 6 న టెండర్లు ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్లకు అక్టోబర్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రజల సంపదతో 80 శాతం పనులు పూర్తిచేసిన ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని విమర్శించారు.ప్రకృతి వనరులు, ఖనిజసంపద, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్లకు కట్టబట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానం తప్ప మరొకటి కాదన్నారు.ప్రజల నుండి భూములను లాక్కొని ప్రజాధనంతో నిర్మించి లాభాలు వచ్చే సమయంలో జిల్లా అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పోరేట్లకు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు.పోర్ట్ ప్రైవేట్ పరం అయితే 2వ దశలో సేకరిస్తున్న 3775 ఎకరాల భూమి కేవలం ఎకరాకి 1రూపాయి లీజుతో కార్పోరేట్ సంస్థ చేతిలోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు . భూమి వినియోగంపై ప్రభుత్వం హక్కుకోల్పోతుంది.మొత్తం రాబడిలో 12 శాతం షేర్ మాత్రమే మారిటైమ్ బోర్డుకు వస్తుంది.జిల్లాలో స్థానికులకు ఉపాధి బుట్ట ధాఖలవుతుందన్నారు .18 సంవత్సరాలు నిండిన యువతకు ఆర్. ఆర్. ప్యాకేజీ అందదని తెలిపారు . కరువు భృతి ఇప్పటికే అందటంలేదు. పోర్టు నిర్మాణంతో ప్రభావిత గ్రామాలను నిర్వాసితుల జాబితాలో చేర్చకుండా అన్యాయం చేసిందన్నారు .4 బెర్తులకే సముద్రం ముందుకు వచ్చి రామాయపట్నం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం ను సముద్రం మింగేస్తుందన్నారు . 19 బెర్తులు పూర్తయితే ఇంకెన్ని పల్లెకారుల గ్రామాలు ముంపుకు గురౌతాయోనని ఆంధోళనగా ఉందన్నారు .400 కుటుంబాలు సముద్రంలో కలవటం తప్ప గత్యంతరం లేనిస్థితి ఉన్నదని పేర్కొన్నారు.ఈ నిర్వాసితులకు ఎవరు బాధ్యత వహించాలి. ప్రభుత్వం పోర్టును ప్రైవేట్ చేతిలో పెట్టి ప్రజలను, నిర్వాసితులను వంచనకు గురిచేస్తుంది.ఇప్పటికే పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయినవారందరికి నష్ట పరిహారం అందలేదని తెలిపారు .కావున పోర్ట్ ప్రైవేటీకరణను రద్దుచేయాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, రామాయపట్నం పల్లెపాలెంను నిర్వాసిత గ్రామాల జాబితాలో చేర్చి పునరావాసప్యాకేజీ ఇవ్వాలని అక్టోబర్ 4 న జరిగే జిల్లాసదస్సులో ప్రజాసంఘాలు, స్వతంత్రసంస్థలు, వ్యక్తులు,అభివృద్ధి కాముకులు పాల్గొని రామాయపట్నం ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతున్నాము. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ యస్. ఎ. గౌస్, , యస్. కె. సల్మా, ఎస్. డి గౌస్ బాషాలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ అనంతరం సిఐటియు జిల్లా సదస్సు కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు.