ప్రకాశం జిల్లా పొన్నలూరు SI గా విధులు నిర్వహిస్తున్న పాలూరు సత్యనారాయణ గారు బదిలీ అవుతున్న సందర్భంగా ఈరోజు పొన్నలూరు పోలీస్ స్టేషన్ లో SI గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ గారు.పొన్నలూరు మండలంలో అన్ని గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడారు, అల్లర్లు గొడవలు లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతినిత్యం నిఘా ఉంచారు, పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితులను గౌరవించి వారి దగ్గర నుండి ఫిర్యాదులు స్వీకరించారు, రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించారు, పండుగల సమయాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తులు ఏర్పాటు చేశారు, కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు, కొన్ని ప్రధాన జంక్షన్ వద్ద మిర్రర్లు ఏర్పాటు చేయించారు, గంజాయి అక్రమ మద్యం మరియు పేకాట రాయుళ్లను హడలెత్తించారు, చట్ట ప్రకారం విధులు నిర్వహించి అతి తక్కువ కాలంలో పొన్నలూరు మండలంలో ఉన్న ప్రజలందరి ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతని పొందగలిగారు అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్ కుమార్, మహేంద్ర, గెరికే మహేష్, కాకాని ఆంజనేయులు, మాధవరావు, డేవిడ్, కందుకూరి కోటయ్య, సత్యాల సుబ్బారావు, హరిబాబు, శ్రీను, బందిల వెంకటేష్ మొదలైన పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు SI గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *