తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో అద్దంకి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలోని అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లు, వ్యక్తులు మరియు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.