ఎల్ నినో ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో…. వాటిని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర 60-65 రూపాయల వరకు ఉండగా… సబ్సిడీపై కేవలం 35 రూపాయలకే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కందుకూరు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ఉల్లిపాయల అమ్మకం కేంద్రాన్ని…. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. పెరుగుతున్న ధరల ప్రభావం పేదలపై పడకుండా, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు రైతు బజార్ అధికారులు, స్థానిక నేతలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ రాయపాటి సుభాషిణి శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఎ.డి వరలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ డి.టి విజయ్ భాస్కర్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వరూపారాణి, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఏఎంసీ డైరెక్టర్ కొత్తూరు సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, షేక్ సలాం, సయ్యద్ రూబీ, షేక్ నజీర్, జియావుద్దీన్, మురారిశెట్టి వెంకట సుబ్బారావు కూనం నరేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *